కొద్ది రోజులుగా బియ్యం ధరలు సాధారణంగానే ఉన్నాయి, మరీ అంత రేటు పెరగలేదు అని చెప్పాలి, ఈ కరోనా సమయంలో అసలే చేతిలో నగదు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఈ సమయంలో బియ్యం ధరలు పెరుగుతున్నాయి, ముఖ్యంగా సన్నబియ్యం ధర పెరుగుతోంది.
ధాన్యం నిల్వలు పుష్కలంగా ఉన్నా డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం బియ్యంపై పడింది. ఇలా డిజీల్ ధర పెరగడంతో రవాణా ఛార్జీలు భారం అవుతున్నాయి అని అందుకే ధరలు పెరుగుతున్నాయి అంటున్నారు వ్యాపారులు.
అధికారులు మాత్రం ధరలు నియంత్రణలోనే ఉన్నాయని చెబుతున్నారు. సాధారణ బియ్యంతో పోలిస్తే బాస్మతి రకం ధర కొంత ఎక్కువగానే ఉంది. బాస్మతి ధర కిలోకు పది రూపాయల వరకు పెరిగింది అని ప్రజలు కూడా అంటున్నారు. సన్న బియ్యం ధర గత నెల రోజుల వ్యవధిలో క్వింటాకు రూ. 350 నుంచి రూ. 400 వరకు పెరిగింది. మంచి క్వాలిటీ సన్నబియ్యం క్వింటాల్ 5000 ధర పలుకుతోంది, ముఖ్యంగా రవాణా ఖర్చులు పెరగడమే బియ్యంధరలు పెరగడానికి కారణం అంటున్నారు వ్యాపారులు. 25 కేజీలు బస్తా మంచి సోనా రైస్ దాదాపు రిటైల్ లో 1300 ఉంటుంది అంటున్నారు.