రైతులకి కేసీఆర్ మరో గుడ్ న్యూస్ రైతులు అందరూ ఇలా చేయండి

రైతులకి కేసీఆర్ మరో గుడ్ న్యూస్ రైతులు అందరూ ఇలా చేయండి

0
90

రైతులకి మన దేశంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి.. ముఖ్యంగా రైతులకి పెట్టుబడి సాయం, అలాగే రుణమాఫీ, రైతులకి నగదు అందించడం, ఎకరాకి పెట్టుబడి సాయం కల్పించడం ఇలా అనేక రాష్ట్రాల్లో విభిన్న పథకాలు అమలు చేస్తున్నాయి.. అంతేకాదు కిసాన్ సాయం కూడా అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

ఏపీలో కూడా రైతులకి రైతు భరోసా అందిస్తున్నారు , తాజాగా తెలంగాణలో కూడా కేసీఆర్ సర్కారు రైతు బంధు ప్రవేశపెట్టి రైతులని సాయం చేస్తోంది, తాజాగా రైతులకి గుడ్ న్యూస్ అందించింది టీఆర్ ఎస్ సర్కార్.. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకానికి అవసరమయ్యే నిధులను తాజాగా మంజూరు చేసింది. త్వరలోనే రానున్నటువంటి రబీ సీజన్ కోసమని రూ.5,100 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు…

దీంతో రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు..పెట్టుబడి సాయంగా నగదుని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది, గతంలో 2019 లో రైతుబంధు కోసం 12,862 కోట్లు కేటాయించగా, ఖరీఫ్ సమయంలో రూ.6,862 కోట్లు మంజూరు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. మరో రెండు మూడు రోజుల్లో రైతు బంధు నగదు రైతుల ఖాతాల్లోకి జమ అవ్వనుంది.