డిసెంబరులో బాబుకు ఆర్కే తో మరో చిక్కు

డిసెంబరులో బాబుకు ఆర్కే తో మరో చిక్కు

0
91

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఓటుకి నోటు కేసు వదిలేలా కనిపించడం లేదు, ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేస్తే ఆకేసులో వాస్తవాలు బయటకు వస్తాయి అంటున్నారు మేధావులు, తాజాగా ఈ కేసు గురించి పోరాటం చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మరోసారి సుప్రీం కోర్టుని ఆశ్రయించారు.

సుప్రీంకోర్టులో ఎర్లీ హియరింగ్ పిటిషన్ను వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో ప్రస్తుతం ట్రయల్ కోర్టులో కేవలం ఏ1 నుంచి ఏ5 వరకు మాత్రమే విచారణ జరుపుతున్నారని చంద్రబాబు మీద విచారణ జరపడం లేదని ఆయన పొందుపరిచారు. దీంతో మరోసారి ఈ కేసుతెరపైకి వచ్చింది.

2015లో ఎమ్మెల్సీని కొనుగోలుచేశారు అనే విషయంలో 50 లక్షలు లంచం ఇస్తూ దొరికిపోయారు రేవంత్ రెడ్డి, అయితే ఇందులో చంద్రబాబు వాయిస్ తో అడ్డంగా బుక్కయ్యారు. ఓసారి నా వాయస్ అని మరోసారి నాది కాదు అని బాబు కూడా పలు ఆన్సర్లు ఇచ్చారు.. అయితే ఇప్పుడు ఈ కేసు విచారణ మళ్లీ వేగవంతం అవడంతో దీనిపై తీర్పు ఎలా వస్తుందా అని చూస్తున్నారు. అయితే బాబు విచారణ ఎదుర్కొంటారా లేదా అనేది చెప్పలేము అంటున్నారు.