రోడ్ల‌పైకి వ‌చ్చి ఇలా చెప్పి పోలీసుల నుంచి త‌ప్పించుకుంటున్న యువ‌త — వ‌ద‌ల‌కండి

రోడ్ల‌పైకి వ‌చ్చి ఇలా చెప్పి పోలీసుల నుంచి త‌ప్పించుకుంటున్న యువ‌త -- వ‌ద‌ల‌కండి

0
78

ఈ వైర‌స్ వ్యాప్తి చెందుతోంది.. మాట వినండి రోడ్ల‌పైకి రాకండిరా బాబు అంటే వినేవారు ఉండ‌టం లేదు.. గ‌ల్లీల నుంచి మెయిన్ రోడ్లపైకి వచ్చి బైకుల‌పై ర‌య్యుమ‌ని తిరుగుతున్నారు.. అలాంటి వారిని పోలీసులు వ‌దిలిపెట్ట‌డం లేదు… యువ‌త బైకులు వేసుకువ‌స్తే వారిని ఆపుతున్నారు, వెంట‌నే లాఠీకి ప‌ని చెబుతున్నారు.

మ‌రో ప‌క్క ఇలా పోలీసుల నుంచి త‌ప్పించుకునేందుకు నీచ‌మైన అబ‌ద్దాలు ఆడుతున్నారు అని పోలీసులు తెలుసుకుంటున్నారు…తాజాగా ఓ వ్య‌క్తి ఆస్ప‌త్రిలో ర‌క్తం అవ‌స‌రం వ‌చ్చింది బ్లడ్ డొనేట్ చేయ‌డానికి వెళుతున్నా అని చెప్పి వెళ్లాడు.

మ‌రో వ్య‌క్తి మా అమ్మ ఆస్ప‌త్రిలో ఉంది ఆమెకి భోజ‌నం తీసుకువెళుతున్నా అని వెళ్లాడు….మ‌రో వ్యక్తి మా నాన్న‌కి హ‌ర్ట్ అటాక్ అందుకే గ్రామం వెళుతున్నా అని ప‌ర్మిష‌న్ … అయితే ఇలా మ‌స్కా కొట్టి వెళుతున్న వారిని పోలీసులు క్రాస్ చెక్ చేసి ప‌ట్టుకుంటున్నారు…చూశారుగా ఇలాంటి చెత్త మాట‌లు చెప్పి బ‌య‌ట‌కు రాకండి, ఇంట్లో మీరు ఉండ‌టం వ‌ల్ల ప‌ది మందికి వైర‌స్ రాకుండా ఉంటుంది.