ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో మూడు రోజులు పర్యటించిన సంగతి తెలిసిందే… ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… గతంలో ముద్దుకృష్ణమ నాయుడు మరణించిన తర్వాత నగరిలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించి ఉంటే బాడుగుండేదని అన్నారు…
అభ్యర్థని ప్రకటించకపోవడం వల్లే నగరిని కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు… ముద్దుకృష్ణమ నాయుడు మరణం తర్వాత కుటుంబ సభ్యుల్లో ఏర్పడి ఒత్తిడి వల్ల ఆలస్యం చేశామని ఫలితంగా నగరి నియోజకవర్గాన్ని చేతులారా పోగొట్లుకున్నామని అన్నారు…
కుటుంబ సభ్యులు ఎన్నికలలోపు కలుస్తారని అనుకున్నాము కానీ ఇలా ఓటమికి పనిచేస్తారను కోలేదని అన్నారు… టీడీపీలో నాయకుడుగా ఎదాగాలనుకునే వారు శత్రువులను పెంచుకోకూడని అన్నారు…