జగన్ సీక్రెట్ ను బయటపెట్టిన ఫైర్ బ్రాండ్ రోజా

జగన్ సీక్రెట్ ను బయటపెట్టిన ఫైర్ బ్రాండ్ రోజా

0
71

నిర్ధేశించిన సమయంలోనే పారిశ్రామిక వేత్తలను అనుమతిస్తామని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా స్పష్టం చేశారు…తాజాగా నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక సదస్సులో రోజా మాట్లాడుతూ…

పారిశ్రామిక వేత్తలను నిర్దేశించిన సమయంలోనే అనుమతిని ఇస్తామని స్పష్టం చేశారు. పైసా లంచం తీసుకోకుండానే అనుమతులు ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని స్పష్టం చేసారు… పరిశ్రమలు ఏర్పాటు చేసిన తరువాత స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు…

ఆంధ్రప్రదేశ్ కు పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బాహుబలి అని, మంత్రి గౌతమ్ రెడ్డి సైరా నరసింహారెడ్డి అని అన్నారు వీరిద్దరూ కలిసి రాష్ట్రానికి మంచి పారిశ్రామిక పాలసీని తీసుకువస్తారని అన్నారు రోజా