రోజా తో విభేదాల గురించి చెప్పిన నాగబాబు

రోజా తో విభేదాల గురించి చెప్పిన నాగబాబు

0
105

బుల్లితెరలో వచ్చే జబర్దస్త్ ఎంతో ఫేమ్ సంపాదించుకుంది …కామెడీ పండించే స్కిట్లతో టీమ్ సభ్యులు ఫుల్ ఖుషీ చేస్తే, తమ నవ్వులతో నాగబాబు రోజా షోకు మరింత అందం తెచ్చారు. ఇక తమ గ్లామర్ తో ఓపక్క రష్మి మరో పక్క అనసూయ అమాంతం షో రేటింగ్ కు హైప్ తీసుకువచ్చారు. అయితే నాగబాబు జనసేన నుంచి రాజకీయాల్లో ఉన్నారు.. ఇక రోజా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా నగరి నుంచి ఉన్నారు. అలాగే ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా కూడా ఉన్నారు.

మరి పవన్ కల్యాణ్ జనసేన తరపున తన వాయిస్ వినిపిస్తున్నారు, ఈ సమయంలో ఆయన జగన్ పై విమర్శలు చేస్తున్నారు…దీంతో వైసీపీ నేతలు పవన్ పై విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు.. ఇందులో రోజా కూడా ఉన్నారు. అయితే రోజా నాగబాబు ఇద్దరూ జబర్దస్త్ జడ్జీలుగా ఉన్నారు. మీ సోదరుడు మీ పార్టీ అధినేతపై రోజాగారు విమర్శలు చేయడం చూస్తున్నారు కదా, ఈ విషయం పై మీ రియాక్షన్ ఏమిటి అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది.. దీనికి నాగబాబు సరైన సమాధానం ఇచ్చారు.

తాము ఇద్దరం రాజకీయాలు వేరుగా ప్రొఫెషనల్ వేరుగా చూస్తాం అన్నారు.. నేను తను కేవలం ఈ షోలకు జడ్జీలము మాత్రమే.. అక్కడ వరకూ మాత్రమే పరిమితం. రాజకీయాలకు ఈ షోలకు సంబంధం ఉండదు కాబట్టి మా మధ్య అలాంటి చర్చ జరగదు అని చెప్పారు నాగబాబు.