ఏపీలోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్, చిరంజీవి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రోజా ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. గతంలో రోజా చిరంజీవితో అనేక సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే రోజా రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా చిరంజీవిని అభిమానిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది.