గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన లేడీ లీడర్

గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన లేడీ లీడర్

0
126

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది…. మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీకి చెందిన అశావాహులు ఒక్కొక్కరు జారుకుంటున్నారు.. ఇప్పటికే టీఆర్ఎస్ నేత గుర్రంగూడ మాజీ ఇన్ చార్జ్ సర్పంచ్ జక్కిడి జంగారెడ్డి ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే…

ఇక ఈ షాక్ నుంచి పార్టీ అధిష్టానం కోలుకోకముందే మరో షాక్ తగిలింది… ఆ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ రాళ్లగూడెం సంతోషీ శ్రీనివాస్ రెడ్డి గలాబి పార్టీకి గుడ్ బై చెప్పారు… 29వ వార్డులో పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకున్నారు సంతోషి… కానీ ఆమెకు మొండిచెయి చూపించారు గులాబీ బాస్ లు…

దీంతో ఆమె తీవ్ర నిరాశకుచెంది కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపి ఆ పార్టీ తీర్థం తీసుకున్నారు… ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సిట్టింగ్ లందరికి సీటు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారని ఆమె మండిపడ్డారు…