ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. రక్తపోటు స్థాయి ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు.
కాగా రోశయ్య అంత్యక్రియలు హైదరాబాదులో నేడు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉదయం 11 గంటలకు గాంధీభవన్ కు తరలించనున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు కొంపల్లి ఫాంహౌస్ లో రోశయ్య అంత్యక్రియలు జరుగుతాయి. ఏపీ ప్రభుత్వం తరఫున రోశయ్య అంత్యక్రియలకు మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరుకానున్నారు.