రూ.10 బిర్యానీ హోటల్ యజమాని అరెస్ట్ ఏం చేశాడంటే

-

ఈ కరోనా సమయంలో వ్యాపారాలు చాలా మందికి దెబ్బ తిన్నాయి, ఈ ఆరు నెలల కాలంలో కొత్త వ్యాపారాలు పెడదాము అని ఆగిపోయిన వారు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, ఈ సమయంలో కొత్తగా వ్యాపారాలు పెట్టి షాపుకి కస్టమర్లు వచ్చేలా ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నారు, పలు ఫుడ్ కోర్టులు బిర్యానీ పాయింట్లు కూడా చాలా వెలిశాయి.

- Advertisement -

ఆదివారం రోజున తమిళనాడులోని అరుప్పుకొట్టై లో ఓ హోటల్ ను ప్రారంభించారు ఇక్కడ. ఆ హోటల్ ప్రచారం కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రూ.10 బిర్యానీ అని ప్రకటించారు.
ఇక వందలాది మంది బిర్యానీ కోసం క్యూ కట్టారు దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.

ఇక చాలా మంది మాస్క్ పెట్టుకోలేదు, ఇక సోషల్ డిస్టెన్స్ పాటించలేదు, దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు హోటల్ ఓనర్ పై కేసు పెట్టారు.. హోటల్ లో అప్పటికే సగానికి పైగా బిర్యానీ ప్యాకెట్లు అమ్మినట్లు పోలీసులు చెప్తున్నారు. యజమానిని అరెస్ట్ చేసిన తరువాత మిగిలిన బిర్యానీ ప్యాకెట్లను యాచకులు పంచారు. ఇక ఇలాంటి ఆఫర్లు ఇస్తే పలు జాగ్రత్తలు కూడా పాటించాలి, ఏ జాగ్రత్తలు లేకుండా ఉండటం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...