కరోనాతో పేరెంట్స్ ని కోల్పోయిన అనాథ పిల్లలకు రూ.10లక్షల పరిహారం -ఇవి తెలుసుకోండి

Rs 10 lakh compensation for orphans who lost their parents with Corona

0
121

కరోనా చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అంతేకాదు చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు మరణించడంతో ఆ పిల్లలు అనాధలు అయ్యారు.ఈ కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఆ కుటుంబాలకు బీమా ఉన్నా రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలని తాజాగా సర్కారు నిర్ణయించింది. ఇక ఈ సాయం అప్లై చేసుకున్న వారికి పిల్లల పేరు మీద 10 లక్షలు డిపాజిట్ చేస్తారు. దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెలా పిల్లలకు అందజేస్తారు.

వారికి 25ఏళ్లు వచ్చే వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఆ తర్వాత పిల్లలు ఆ నగదు విత్ డ్రా చేసుకోవచ్చు, అంతేకాదు 18ఏళ్ల లోపు పిల్లలకే ఈ బీమా వర్తిస్తుంది. ఈనిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆ పిల్లలకు ఈ నగదు సాయం ఎంతో ఊరటనిస్తుందంటున్నారు.