ఇళ్లుకట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు.. నిజమే ఇప్పుడు పెళ్లి కంటే ఇళ్లు కట్టడం కష్టం అవుతోంది.. లక్షల రూపాయల ఖర్చు అవుతోంది.. ఓ ఫ్యామిలీ ఇంటికి డబుల్ బెడ్ రూమ్ అయితే అన్నీ కలిపి 30 లక్షలు అవుతోంది, అయితే ఇక సిటీల్లో కోట్ల రూపాయల విలువ ఉంటుంది.. అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో ఓ అద్బుతమైన ఇల్లు నిర్మించారు ఒకరు.. ఏకంగా దీని విలువ రూ 40 కోట్ల రూపాయలట.
తూర్పుగోదావరి జిల్లా బలభద్రాపురంలో రూ.40 కోట్లతో ఓ ఇంద్రభవనాన్ని నిర్మించారని అంటున్నారు అందరూ… బిక్కవోలు మండలంలోని ఈ గ్రామం మామూలు పల్లెటూరు కంటే పెద్దదే…మరి ఇప్పుడు ఇది ఏపీ తెలంగాణలో హైలెట్ అయింది.. ఇంటిలోపల చూస్తే సినిమా పరిశ్రమకు తగ్గ రీతిలో ఇంటీరియర్ కనిపిస్తోంది, బహుశా నిర్మాత లేదా దర్శకుడి ఇళ్లు అయి ఉంటుంది అని అంటున్నారు చూసిన వారు..
అందమైన స్విమ్మింగ్ పూల్.. చూడగానే కట్టిపడేసే ఇంటీరియర్ డెకరేషన్.. దేవుని ప్రతిమలు, మిని థియేటర్, లాన్, పార్కింగ్ ప్లేస్, ఇలా అన్నీ ఉన్నాయి… దాదాపు రూ.40 కోట్లు ఉంటుంది అని అంటున్నారు. చివరగా ఈ ఇంట్లో చిరంజీవి, మహేశ్ బాబు ఫొటోలను ఉంచారు.
మరి ఈ వీడియో మీరు చూసేయండి.
తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామం లో 40 కోట్ల ఇల్లు anta evardho Maheshbabu+chiru photo petkunnadu pic.twitter.com/FevnMS5dxw
— Mani (@imaheshfan) December 22, 2020