ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తడబాటు..ఛత్తీస్‌గఢ్‌ ఘటనను టీఆర్ఎస్ కు ముడిపడుతూ ట్వీట్

0
82

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు శవాన్ని ఓ తండ్రి ఎత్తుకొని 10 కి.మీ నడిచిన హృదయవిదారక ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో జరిగింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుర్గుజ జిల్లాలోని అమ్‌దల గ్రామస్థుడు ఈశ్వర్‌ దాస్‌ కుమార్తె సురేఖ తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో ఆమెను శుక్రవారం ఉదయం లఖన్‌పూర్‌ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళారు. ఆమె ఆక్సిజన్‌ లెవెల్స్‌ దాదాపు 60కి పడిపోయాయి.

అవసరమైన చికిత్స చేసినప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదని, మరింత క్షీణించిందని వైద్యులు చెప్పారు. దీనితో ఆమె తుదిశ్వాస విడిచిందని తెలిపారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్ళేందుకు వాహనం వస్తుందని చెప్పామని, ఉదయం 9.20 గంటలకు ఆ వాహనం వచ్చిందని, అప్పటికే ఈశ్వర్‌ వెళ్ళిపోయారని చెప్పారు. వాహనం ఆలస్యం కావడంతో దాస్ తన కూతురుని ఎత్తుకొని స్వగ్రామం వరకు నడిచాడు.

అయితే ఈ ఘటనపై బీఎస్పీ నాయకులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తడబాటుకు గురయ్యారు. వేరే రాష్ట్రంలో జరిగిన సంఘటనకు తెలంగాణలోని టిఆర్ఎస్ పార్టీకి ముడిపెడుతూ ట్యాగ్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. “ఇంకా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం? పాలకులకు సిగ్గు శెరం ఉండాలె! TRS వైద్యశాఖకు కేటాయించిన కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పోతుంది? ప్రభుత్వంలో ఉండి ప్రజల కష్ఠాలు తీర్చడం మీ చేతకాకపోతే గద్దె దిగండి. BSP అధికారంలోకి వస్తే ప్రతి గ్రామానికి ఒక అంబులెన్సు అందుబాటులో ఉంచుతాం అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను నెటిజన్లు  చేస్తున్నారు.