ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరబోయే పార్టీ ఇదే

0
108

మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అతి త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నారు. ఈమేరకు ఆయన తన సన్నహితులకు సంకేతాలు ఇచ్చారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు బహుజన సమాజ్ పార్టీలో చేరాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

అయితే ఆగస్టు 8వ తేదీన నల్లగొండలోని ఎన్ జి కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి లక్షలాది మంది సమక్షంలో బిఎస్పీలో చేరనున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా అదేరోజు రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ కో ఆర్డినేటర్ రాంజీ గౌతం సమక్షంలో ఈ చేరిక ఉంటుందని కూడా సమాచారం. దీనిపై అతి త్వరలోనే అధికారికంగా వెల్లడించే చాన్స్ ఉంది.