ఆర్టీసీ కీలక నిర్ణయం..వారు టికెట్‌ లేకుండానే ప్రయాణించొచ్చు!

RTC key decision..they will travel without a ticket!

0
61

బాలల దినోత్సవం సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు ఈరోజు ఏ బస్సులో ప్రయాణించినా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఉచిత ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఏసీ, మెట్రో, డీలక్స్‌, ఆర్డీనరీ ఇలా ఏ బస్సులోనైనా ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. బాలలదినోత్సవం సందర్బంగా బాలబాలికలకు శుభాకాంక్షలు తెలియజేశారు.