అధిక ధరలకు అమ్మేవారికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ షాక్

0
86

సజ్జనార్ టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్నారు. దసరా వేళ అధిక చార్జీలు లేకుండా బస్సులను నడిపి శబాష్ అనిపించుకున్నారు. ఇక బస్టాండ్‌లో స్టాళ్లు పెట్టి అధిక ధరలకు అమ్ముతూ ప్రజలను దోచుకుంటున్న నిర్వాహకులకు భారీ జరిమానా విధించారు. ఎవరైనా ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులు అమ్మెందుకు వీలు లేదు. కానీ కొన్ని స్టాళ్లు మాత్రం ఎంఆర్పీ కంటే అధిక ధరలకు అమ్ముతూ దోచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు రైడ్స్ చేశారు.

ఇక టాయిలెట్స్‌కి ఛార్జ్ చేస్తున్న వారికి కూడా జరిమానా విధించారు అధికారులు. ఈ వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు సజ్జనార్.. ‘బస్టాండ్లలోని స్టాళ్ల యజమానులను ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్ముతున్నారు. వారిపై మా బృందాలు చర్యలకు దిగి జరిమానా విధిస్తున్నాయి. అధిక ధరలను నియంత్రించేందుకు ప్రయాణికులు ఆర్టీసీ డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేయాలి. స్టాళ్ల యజమానుల అక్రమాలపై సోషల్‌ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు’ అని సజ్జనార్‌ పేర్కొన్నారు.