Flash News : కేసిఆర్ ఇలాకాలో పల్లె ప్రగతి బహిష్కరణ

0
92

సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలోనే సర్పంచులు నిరసనలు చేపట్టడంతో పరిసరప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవపూర్ మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించగా..వివిధ గ్రామాల సర్పంచులు ఈ సమీక్షలో పాల్గొని ఆందోళనకు దిగారు.

గతంలో చేసిన పనులకు బిల్లులు రాక అప్పుల పాలు అయ్యామని వాపోయారు. అందుకే ఈసారి గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల చేసేఅంత వరకు పల్లె ప్రగతి, సమీక్ష సమావేశాన్ని మండల సర్పంచ్ లు బహిష్కరించి తీరుతామని ఆవేదన వ్యక్తం చేసారు. పెండింగ్ బిల్లులు విడుదల చేసినతరువాతే  పల్లె ప్రగతి పనులు చేస్తామని తేల్చి చెప్పారు.