రష్యా ప్రపంచంలో అగ్ర రాజ్యంలో ఇది కూడా ఒకటి, అయితే తాజాగా కరోనా వ్యాక్సిన్ ప్రపంచ దేశాల్లో ముందు రష్యా విడుదల చేయడంతో అందరూ ఇప్పుడు ఇదే విషయం చర్చించుకుంటున్నారు.
ఇక్కడి ప్రజలు పుతిన్ ను లైఫ్ టైమ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. పుతిన్ కోసం రాజ్యాంగాన్నే మార్చేశారు.
పుతిన్ కు గూడఛారి సినిమాలు అంటే చాలా ఇష్టం, ఏదీ అంత ఈజీగా నమ్మరు, చాలా కోణాల్లో ఆలోచన పరిశీలన చేస్తారు, ఇక చిన్న వయసు నుంచి ఆయన గూడఛారి కావాలి అని అనుకున్నారు,
16 ఏళ్ల వయసులో అంటే 1968లో రష్యా ఇంటిలిజెన్స్ సంస్థ కేజీబీలో జాయిన్ అయ్యి, రష్యా ఆధీనంలో ఉన్న తూర్పు జర్మనీలోని కేజీబీ ఆఫీస్ లో కొన్నాళ్ళు ట్రాన్స్ లేటర్ గా పనిచేశారు..
ఇలా ఎంతో పేరు సంపాదించుకున్న పుతిన్ మే 7 2000 సంవత్సరంలో రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2000 నుంచి 2008 వరకు రెండుసార్లు రష్యా అధ్యక్షుడిగా ఆయన పని చేశారు, తన మార్క్ పాలనతో ప్రజల్లో పేరు సంపాదించారు, పుతిన్ 2008 నుంచి 2012 వరకు ప్రధానిగా పనిచేశారు.
తిరిగి 2012లో పుతిన్ ను రష్యా అధ్యక్షుడిగా ప్రజలు ఎన్నుకున్నారు. తిరుగులేని నేతగా రష్యాలో ఎదిగారు ఆయన.