రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాజీనామా చేస్తారా? కారణం ఆ వ్యాధేనా

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాజీనామా చేస్తారా? కారణం ఆ వ్యాధేనా

0
110

రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తాను బతికి ఉన్నంత వరకూ తానే అధ్యక్షుడిగా ఉండాలి అని భావించాడు, రాజ్యాంగంలో ఇటీవల దానికి అనుగుణంగా పలు మార్పులు చేశారు.. అలాంటి పుతిన్ తన పదవికి రాజీనామా చేస్తున్నారు అని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే పెను చర్చకు కారణం అయింది.

రష్యాలో దాదాపు 21 సంవత్సరాలు అధికారంలో ఉన్న అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది తన పదవికి రాజీనామా చేయవచ్చునని చర్చ విపరీతంగా జరుగుతోంది. దీనికి కారణం వ్లాదిమిర్ పుతిన్కు తీవ్రమైన పార్కిన్సన్ వ్యాధి ఉందని,
అందుకే కుటుంబం కూడా ఈ పదవికి రాజీనామా చేసి రెస్ట్ తీసుకోవాలి అని కోరుతోంది,

వచ్చే ఏడాది జనవరిలో పుతిన్ అధికారాన్ని వేరొకరికి అప్పగించవచ్చని మాస్కో రాజకీయ శాస్త్రవేత్త వాలెరి సోలోవే వెల్లడించారు.ఇటీవల కొన్ని ఫుటేజీల్లో కూడా చూసి తెలియచేస్తున్నారు, ఆయన కాళ్లు వణుకుతున్నాయి, వేళ్లు కదులుతున్నాయి అని తెలిపారు, ఆయన చేతితో కప్పు కూడా తీసుకోవడం కష్టంగా ఉంటోంది అని తెలిపారు.

68 ఏళ్ల పుతిన్ పార్కిన్సన్ మెదడులోని నాడీ వ్యవస్థ దెబ్బతినడం వ్యాధితో బాధపడుతున్నారని, డాక్టర్లు కూడా ఇలాంటి సమయంలో ఈ పదవి నుంచి తప్పుకుని రెస్ట్ తీసుకోవాలి అని సూచిస్తున్నారు, అయితే ఆయన తర్వాత పదవి ఎవరు తీసుకుంటారు అనేది ఇప్పుడు దేశంలో చర్చ.పుతిన్ ప్రస్తుత అధ్యక్ష పదవీ కాలం 2024 వరకూ ఉంది.