Big Breaking- ఉక్రెయిన్ లో యుద్దానికి రష్యా బ్రేక్

0
88

ఉక్రెయిన్‌-రష్యా యుద్దంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌పై యుద్దానికి తాత్కాలికంగా రష్యా బ్రేక్ వేసింది. ప్రపంచ దేశాల ఒత్తిడితో రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటల నుంచి కాల్పులను నిలిపివేయగా..ఐదున్నర గంటల పాటు ఇది కొనసాగనుంది. ఉక్రెయిన్ లో ఉన్న విదేశీయుల తరలింపు కోసం రష్యా ఈ కాల్పుల విరమణను ప్రకటించింది.