Flash: ఉక్రెయిన్ జవాన్లపై రష్యా సైన్యం దాడి..ఐదుగురు మృతి

0
62

తమ దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉక్రేనియన్ జవాన్లపై రష్యా సైన్యం దాడి చేసింది. ఈ కాల్పుల్లో 5 గురు ఉక్రెయిన్‌ సైనికులు మరణించారని రష్యా తెలిపింది. తమ భూభాగంలోనే ఉక్రెయిన్‌ సైనికులను హతమార్చినట్లు వెల్లడించింది. రష్యా సైన్యం ప్రకటనను ఉక్రెయిన్‌ మిలటరీ ఖండించింది. ఉక్రెయిన్‌ సైనికులు చొరబాటుకు ప్రయత్నించారన్న రష్యా వాదనను తోసిపుచ్చింది.