తెరుచుకున్న శబరిమల ఆలయం..ఒక్కరోజు మాత్రమే దర్శనం

Sabarimala Temple is open for one day only

0
91

శబరిమల అయ్యప్ప ఆలయం తిరిగి తెరుచుకుంది. ప్రత్యేక పూజల కోసం ఒక్కరోజు మాత్రమే ఆలయాన్ని తెరిచారు. ముందస్తు బుకింగ్ చేసుకున్న భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. నవంబర్ 15న ఆలయం పూర్తి స్థాయిలో తెరుచుకోనుంది.

కాగా ఆలయానికి వచ్చే భక్తులు టీకా ధ్రువీకరణ పత్రాన్ని తప్పక సమర్పించాలి. లేదంటే 72 గంటల్లోపు తీసిన కొవిడ్ నెగెటివ్ రిపోర్టును అందించాలి. పూజ కార్యక్రమాలు పూర్తి చేసి బుధవారం రాత్రి 9 గంటలకు ఆలయాన్ని మూసేయనున్నారు. తిరిగి నవంబర్ 15న అయ్యప్ప గుడి తెరుచుకోనుంది. అప్పటి నుంచి రెండు నెలల వరకు ఆలయం తెరిచే ఉంటుంది.