కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ పైలట్ మరో సెన్సెషనల్ డెసిషన్…

కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ పైలట్ మరో సెన్సెషనల్ డెసిషన్...

0
86

రాజస్థాన్ రాజకీయాలు మరో మలుపు తిరిగింది.. స్పీకర్ ఇచ్చిన నోటీస్ పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ నిర్ణయించారు.. ప్రస్తుతం తన వర్గం నేతలతో జైపూర్ లో చర్చలు జరుపుతున్న పైలట్ తనకు వ్యతిరేకంగా వచ్చిన నోటీసులపై న్యాయ పోరాటం చేస్తానని నిర్ణయించారు..

నోటీసులకు సమాధానం ఇవ్వడానికి కనీసం ఏడు రోజుల సమయం ఇవ్వాలని నిభందనలు చెబుతున్నా స్పీకర్ వాటిని ఉళ్లంగించారని సచిన్ పైలట్ వర్గం ఆరోపిస్తోంది… కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఇవ్వడంపై సచిన్ పైలట్ అభ్యంతరం వ్యక్తం చేశారు…

స్పీకర్ ఇచ్చిన నోటీసులకు రేపటిలోగా సమాధానం చెప్పాల్సి ఉంది… దీంతో ఈలోపే సుప్రీంకోర్టులో పిటీషన్ వేయాలని సచిన్ పైలట్ భావిస్తున్నారు… సీఎల్పీ భేటీకి డుమ్మాకొట్టి ప్రభుత్వాన్ని అస్థిర కుట్రలు చేశారన్న కారణంతో రెబల్ ఎమ్మెల్యేలకు కూడా కాంగ్రెస్ పార్టీ నోటీసులను జారీ చేసింది… రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ కోరుతోంది…