మాకు శానా నీల్గుడు (పొగరు- మస్తి బలుపు)

0
90
మాకు శానా నీల్గుడు (పొగరు- మస్తి బలుపు) .తెలంగాణాలో అందులో నల్లగొండలో పుట్టినందుకు..ఈ మట్టి ,ఈ మట్టిలో పుట్టిన మనుషులు అందుకు కారణం.
చిన్నప్పుడు పాలమూరు జిల్లా నల్లమలలో ఉన్న అమ్మమ్మ ఊరు కొండనాగుల ఆ చుట్టుపక్కల చుట్టాల ఊర్లకు పోయినప్పుడు కమ్యూనిస్టు రంగమ్మ గురించి కథలు కథలుగా చెప్పె వాళ్ళు..ఇటోస్తే కమ్యూనిస్టు రాములమ్మ గురించి చెప్పవాళ్ళు..మట్టిమహిలైన ఆ పదారు కూడా నిండని పౌరుషవీర బాలలు
రాములమ్మ రంగమ్మ లంటే దొరలకు భూస్వాముల కు పుచ్చి పడేది.అట్లా చిన్నప్పుడు వాళ్ళగురించి వింటూ చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ,
ఆజానుభాహులు సాయిధ పోరాట విరయోధులైన
అన్నాచెల్లెళ్లు మల్లు స్వరాజ్యం భీమిరెడ్డి నర్సింరెడ్డి లను
అత్యంత అందగాడయిన ధర్మ భిక్షంలను చూస్తూ వింటూ పెరిగినం.
రంగమ్మ రాములమ్మ స్వరాజ్యం గార్లు పరిచాయమయ్యాక ..పక్క వాళ్ళ కాళ్లకు ముళ్ళుగుచ్చుకుంటే దాన్ని తీయాలని ,ఎందుకు గుచ్చుకుందో? ఎందుకు తీయాలో ? ,అసలు ముళ్లే లేకుండా చేయాలని ,చెప్పులు (సంపద) అందరికి ఎందుకు లేవో కొందరికే ఎందుకు ఉన్నవో చెప్పేదే, మార్క్సిజం అని, ఆ ముళ్ళు ఎప్పుడూ కొందరికే కుచ్చుకోవడానికి, చెప్పులు (శ్రమ సంపద) సృష్టించిన వాళ్లకు చెప్పులే లేకపోవడానికి ఈ దేశం లో “కులమే “కారణమని ,దాన్ని నిర్ములించాలని చెప్పేదే అంబేడ్కరిజం అని, అలా ముల్లులు తీయడానికి (చిమట -పిన్నీసు)
ముల్లులే లేకుండా చేయడానికి (గొడ్డలి- కొడవలి) పనిముట్లు (ఆయుదాలు) పట్టాలని చెప్పేదే లెనినిజం మావోయిజం అని అర్ధమయింది…
ఈ నేల మీద నడయాడిన మన కాలపు వీరయోధులు
కొమరoభీమ్ నుండి పులి అంజయ్య దాకా
నల్లా నర్సింహులు నుండి నల్లా ఆదిరెడ్డి దాకా.
సమ్మక్క సారక్కల నుండి
స్వర్ణక్క లదాకా
ఆ ముళ్ళు తీసే పని -ఆ ముళ్ళు లేకుండా చేసేపని పెట్టుకుని ఈ నేలకు ఒక వీరత్వాన్ని అమరత్వాన్ని
ఇచ్చారు.
మల్లు స్వరాజ్యం రంగమ్మ రాములమ్మలు తమ పది పన్నేoడేళ్ళ వయసులో , ఆనాటి దొరల భూస్వాముల రజాకార్ల దుర్మార్గాలకు వ్యతిరేకంగా తప్పని సరై తుపాకులు పట్టి అనేక కష్టనష్టాలు అనుభవించి వీరోచితంగా పోరాడారు.
వీళ్ళకు ఎన్నో కలలు ఆకాంక్షలు ఉండొచ్చు.. కుటుంబం బాధ్యత లు అనే ఆంక్షలు పరిధులు పరిమితులు లోబడి పని చేశారు. కమ్యూనిస్టు రాజకీయాలు ఎన్నికలు పొత్తులు వ్యవహారంలో పార్టీలు ప్రజలకు దూరమై నప్పటికి స్వరాజ్యం గారు మాత్రం నిత్య నూతనంగా
అన్ని ప్రజాస్వామిక ఉద్యమాల్లో చురుగ్గానే పాల్గొన్నారు.
తన తొంబైఏళ్ల నిండు జీవితంలో దాదాపు ఎనభై ఏండ్లు
పీడిత ప్రజల కోసం సుదీర్ఘ కాలం పోరాట పటిమతో పనిచేస్తూ సొంత పార్టీ తోను అన్నీ ప్రజాసంఘాల తోను పని చేయడం
ప్రజల మధ్య బతకడం మాములు మాట కాదు. ఎన్ని దుఃఖ లను మోసిందో పండు తల్లి.
మల్లు స్వరాజ్యం గారికి రావాల్సినంత గుర్తింపు రాలేదన్నది ఎంత నిజమో.. ఇంకా అనేక మంది చరిత్రలో కనుమరుగయ్యారు అనేది అంత నిజం.ఆ తల్లుల త్యాగాలు వెలకట్టలేనివి.
స్వరాజ్యం గారికి ఆ త్యాగ మూర్తులైన సబ్బండ వర్ణాల సకల బాహుజన తల్లులకు…
ఫేస్ బుక్ వాల్ నుంచి
(మట్టి మనిషి)