మంత్రి పువ్వాడ అజయ్ వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు సాయి గణేష్ వాంగ్మూలం ఇచ్చాడు. సాయి గణేష్ మరణ వాంగ్మూలం మేరకు పోలీసులు మంత్రి పువ్వాడ అజయ్ పై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. CMO ఆదేశాల వల్లే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై Case నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు. సాయి గణేష్ ఆత్మహత్యకు గల కారకులైన వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ శ్రేణులు సాయి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న ఆత్మహత్య యత్నం చేసిన సాయి గణేష్ కి మద్దతు గా బీజేపీ లీడర్ లు నిలిచారు.
సాయి పై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేసిందని అన్నారు. బీజేపీ ఎదుగుదలను తట్టుకోలేక సాయిగణేష్ లాంటి ఒక కార్యకర్త పై పీడీయాక్ట్ పెట్టారని బండి సంజయ్ ఆరోపించారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, విమర్శించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ టీఆర్‌ఎస్ సర్కారు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఈ మరణంపై చలించిపోయారు. మంత్రి పువ్వాడ వేధింపుల వల్లే సాయి గణేష్ చనిపోయారని అన్నారు. ఆర్‌ఎస్ అవినీతికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు బీజేపీ కార్యకర్త సాయిగణే్‌షపై 16 కేసులు పెట్టారని.. రౌడీషీట్ ఓపెన్ చేయాలని చూస్తే.. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.
ఇక సాయిగణేష్ అంతిమయాత్రను బీజేపీ శ్రేణులు అయన స్వస్థలంలో అశ్రునయనాలతో నిర్వహించారు. ఖమ్మంలోని కాల్వ రోడ్డులో ఉన్న శ్మశానవాటికలో సాయిగణేష్ మృతదేహాన్ని అంతిమయాత్రగా తీసుకొచ్చిన కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు సాయిగణేష్ ఆత్మహత్యకు మంత్రి పువ్వాడ అజయే కారణమంటూ బీజేపీ శ్రేణులురోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ నిరసన తెలిపారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రి అద్ధాలు ధ్వంసం చేశారు. ఆవేశం ఆపుకోలేక మంత్రి పువ్వాడ అజయ్ ఫ్లెక్సీలను తగులబెట్టారు.