స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి జ‌గ‌న్ కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌బోతున్నారా

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి జ‌గ‌న్ కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌బోతున్నారా

0
88

ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి రాజ‌కీయంగా స‌ల‌హాలు ఇస్తూ ముందు నుంచి ఆయన వెన్నంటి ఉన్నారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. అలాగే సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు.

ఇక జ‌గన్ వైసీపీలోకి ఆహ్వ‌నించారు, అలాగే పెద్ద ప‌దవి కూడా ఇచ్చారు, అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ విజ‌య‌సాయిరెడ్డి జ‌గ‌న్ కు అత్యంత ద‌గ్గ‌ర వ్య‌క్తిగా ఉన్నారు, ఇప్పుడు స‌జ్జ‌ల కూడా ఆయ‌న‌కు వెన్నంటి ఉన్నారు.

సీఎం జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు, ఇక క‌డ‌ప‌కు చెందిన ఆయ‌న‌కు మంచి ప‌ద‌వి ఇవ్వాలి అని రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని చూస్తున్నారు సీఎం జ‌గ‌న్మోహ న్ రెడ్డి.