ఆర్టీసీ ప్రయాణికులకు సజ్జనార్ గుడ్‌ న్యూస్‌..జేబులో డబ్బులు లేకపోయినా బస్సులో ప్రయాణం..ఎలాగో తెలుసా?

Sajjanar good news for RTC passengers..if you have no money in your pocket, travel by bus..do you know how?

0
119

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్టీసీలో కీలక మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల కొత్త విధానాలకు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ తాజాగా మరో కొత్త విధానానికి తెర తీసింది. ఇకపై ప్రయాణికులు జేబులో డబ్బులు లేకుండానే ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కష్టాలకు చెక్‌ పెట్టేందుకు గాను టికెట్‌ తీసుకునే సమయంలో నగదు రహిత లావాదేవీ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. డెబిట్‌/క్రిడెట్‌ కార్డుల ద్వారా టికెట్‌ కొనుగోలు చేసే విధానాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకునే వారు యూపీఐ పేమెంట్స్‌ చేసుకునే విధంగా ఆర్టీసీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

అయితే మొదట ఈ విధానాన్ని హైదరాబాద్, సికింద్రాబాద్‌ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సుల్లో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. నగదు రహిత, లావాదేవీల్లో భాగంగా ఆర్టీసీ ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న బస్‌పాస్‌ కేంద్రాల్లో క్యూఆర్‌ కోడ్‌తో చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా చిల్లర కష్టాలకు చెక్‌ పెట్టడంతో పాటు వినియోగదారులకు శ్రమ తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.