ఆఫ్గానిస్తాన్ లో మళ్లీ పాత రోజులు వస్తాయేమో అని జనం భయపడుతున్నారు. గతంలో తాలిబన్లు పాలించిన కాలంలో అనేక కఠిన ఆంక్షలు అక్కడ అమలు చేశారు. ఆ సమయంలో దేశంలో చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ అలాంటి పరిస్దితి వస్తే ఏమవుతుందా అని మహిళలు మరింత ఆందళన చెందుతున్నారు.
అయితే ఇప్పుడు అక్కడ సెలూన్లలో కూడా వాటి ఓనర్లు తాలిబన్ల విషయంలో భయపడుతున్నారు. ఎందుకంటే సరిగ్గా 20 ఏళ్ల ముందు 1996 నుంచి 2001 వరకు తాలిబన్లు ఆఫ్గాన్లో పాలన చేశారు, అప్పుడు హాలీవుడ్లో సూపర్ హిట్ మూవీ టైటానిక్ వచ్చింది. అందులో హీరో లియోనార్డో డికాప్రియో హెయిర్కట్ అప్పట్లో తెగ పాపులర్ అయింది.
దీనిని బీటిల్స్ కట్ అనేవాళ్లు. అతన్ని చూసి ఆఫ్ఘన్లోని యువత కూడా అలా హెయిర్ కట్ చేయాలంటూ అక్కడి సెలూన్లకు క్యూ కట్టారు. ఇస్లామిక్ చట్టాలను అమలు చేసే తాలిబన్లు ఇలాంటి హెయిర్ స్టైల్ అంగీకరించలేదు. ఎవరైనా వారి మాట కాదని చేయించుకుంటే గుండు కొట్టించేవారు. చివరకు హెయిర్కట్ చేసే సెలూన్ ఓనర్లపై పడ్డారు తాలిబన్లు. ఇలా ఎవరికి అయినా చేస్తే శిక్షిస్తాం అని తెలిపారు.ఇప్పుడు తాబిన్లు వచ్చారు ఇక తమ షాపులు మూతపడినట్లేనని అక్కడి బార్బర్లు భయపడుతున్నారు.