Breaking: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్..

0
89

ప్రస్తుతం వరుసగా కాంగ్రెస్‌ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కాసేపటి క్రితమే బంజారాహిల్స్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎమ్మెల్యే పోలీస్‌ స్టేషన్‌ లో అరెస్టు అయిన ఓయూ నేతలను పరామర్శించేందుకు వెళ్లడంతో జగ్గారెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ కు తరలిస్తున్నట్టు సమాచారం అందుతోంది.