ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిగ్ బాస్ 2 కంటెస్టెంట్

ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిగ్ బాస్ 2 కంటెస్టెంట్

0
103

నూజివీడు అసెంబ్లీ బరిలో సినీనటి పోటీ చేస్తున్నారు. ఇదేమిటి ఇప్పటి వరకూ రాని వార్త ఇప్పుడు వచ్చింది అని అనుకుంటున్నారా, గతంలో విడుదలైన నేనేరాజు నేనేమంత్రి, బిగ్బాస్-2లో పాల్గొన్న సాయి సంజన నూజివీడు అసెంబ్లీకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయం లేటుగా తెలిసింది. అయితే ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అనే విషయం కొందరికి మాత్రమే తెలిసింది. నామినేషన్ వేసిన సమయంలో ఈ విషయాన్ని కొందరు గుర్తించారు.

నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామానికి చెందిన సాయిసంజన అసలు పేరు అన్నే వనజ. ఆమె తండ్రి అన్నే ధనకోటేశ్వరరావు ప్రముఖ రైతు. ఇక స్ధానికంగా పేరు ఉన్న కుటుంబం కావడంతో ఆమె రాజకీయాల్లోకి 2016లోనే జనజాగృతి ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల బిగ్ బాస్ లో పాల్గొన్నారు.. ఇక కాంగ్రెస్ తరపున సీటు ఆశించారు కాని రాకపోవడంతో, ఆమె ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు . వనజ 2016లో మిస్ హైదరాబాద్గా ఎంపికయ్యారు. ఇక ఆమె కుటుంబం గురించి చూస్తే ఆమె దివంగత మాజీ ఎమ్మెల్సీ, మంత్రి పాలడుగు వెంకట్రావుకు సమీప బంధువు.. మరి చూడాలి ఆమె ఎన్నికల్లో పోటి అనడంతో ప్రచారం కూడా చేస్తుండటంతో ఎలాంటి రిజల్ట్ ఇక్కడ వస్తుందా అని మూడు ప్రధాన పార్టీలు ఆలోచనలో పడ్డాయి.