తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 1663 ఖాళీల్లో ఇంజినీరింగ్ విభాగంలో 1,522 పోస్టులు ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటివరకు 46,998 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.
వీటిలో నీటిపారుదలశాఖలో 704 ఏఈఈ పోస్టుల భర్తీకి అనుమతి
నీటిపారుదల శాఖలో 227 ఏఈ పోస్టుల భర్తీకి అనుమతి
నీటిపారుదలశాఖలో 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
నీటిపారుదలశాఖలో 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
భూగర్భ జలశాఖలో 88 పోస్టుల భర్తీకి అనుమతి
ఆర్ అండ్ బీలో 38 సివిల్ ఏఈ పోస్టుల భర్తీకి అనుమతి
ఆర్ అండ్ బీలో 145 సివిల్ ఏఈఈ పోస్టుల భర్తీకి అనుమతి
ఆర్ అండ్ బీలో 13 ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టుల భర్తీకి అనుమతి
ఆర్ అండ్ బీలో 60 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
ఆర్ అండ్ బీలో 27 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అనుమతి
ఆర్థికశాఖలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.