వైసీపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న జగన్ ప్రత్యర్థి సతీష్ రెడ్డి….

వైసీపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న జగన్ ప్రత్యర్థి సతీష్ రెడ్డి....

0
85

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది… కడప జిల్లా టీడీపీ కీలక నేత, వైఎస్ ఫ్యామిలీ ప్రత్యర్థి సతీష్ కుమార్ రెడ్డి తాజాగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు… టీడీపీ సభ్యత్వానికి అలాగే పులివెందుల నియోజకవర్గ ఇంచార్జ్ పదవికి ఆయన రాజీనామా చేశారు…

ప్రస్తుతం సతీష్ రెడ్డి తన అనచరులతో వైసీపీలో చేరే విషయమై మంతనాలు జరుపుతున్నారు… ఈ నెల 13న ఆయన ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకోనున్నారు…

కాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలాగే జగన్ లపై సతీష్ రెడ్డి నాలుగు సార్లు పోటీ చేసి ఓటమి చెందారు… 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా, మండలి డిప్యూటీ చైర్మన్ గా సతీష్ రెడ్డి పని చేశారు…