ఎస్‌బీఐ ఖాతాదారుల‌కి మ‌రో గుడ్ న్యూస్

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కి మ‌రో గుడ్ న్యూస్

0
112

అస‌లే క‌రోనా స‌మ‌యం చేతిలో ఉన్న న‌గ‌దుతోనేచాలా మంది కొన్ని స‌రుకులు తెచ్చుకుని జీవ‌నం సాగిస్తున్నారు, ఈ స‌మ‌యంలో బ్యాంకు ఖాతాల్లో ఉన్న పూర్తి న‌గ‌దు తీసుకుంటున్నారు.. ఏటీ ఎం నుంచి మినిమం త‌మ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కూడా తీసుకుంటున్నారు.

ఇక ఇలాంటి ప‌రిస్దితిలో బ్యాంకులు కూడా మినిమం బ్యాలెన్స్ అనే నియ‌మం తీసేశాయి, కొద్ది రోజులు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయ‌క్క‌ర్లేదు అని తెలిపాయి, ఇక తాజాగా ఎస్ బీ ఐ మ‌రో గుడ్ న్యూస్ చెప్పింది.

ఖాతాదారులపై అదనపు భారం ఉండకూడ‌దన్న ఉద్దేశంతో ఎస్‌బీఐ ఏటీఎం సర్వీస్‌ చార్జీలను ఎత్తివేస్తూ నిర్ణయించింది. అలాగే ఏటీఎంలలో చేసే ఉచిత లావాదేవీల పరిమితులను కూడా ఎత్తివేసింది. ఈ నిర్ణయం జూన్‌ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది, ఇక ఖాతాదారులు ఎస్ బీఐ లో లేదా ఇత‌ర ఎటీఎంలో కూడా న‌గ‌దు డ్రా చేసుకోవ‌చ్చు చార్జీలు మాత్రం మీకు విధించ‌రు.