ఎస్.బీ.ఐ. ఖాతాదారులకి అలర్ట్ ఆ డేటా డిలీట్ చేయండి

ఎస్.బీ.ఐ. ఖాతాదారులకి అలర్ట్ ఆ డేటా డిలీట్ చేయండి

0
95

మన దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్నో సర్వీసులు అందిస్తుంది కస్టమర్లకు.. అయితే ఎస్ .బీ.ఐ ఖాతాదారులకి అలర్ట్ .. ఖాతాదారులు మీ బ్యాంకు ఖాతాకి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఫోన్లో సేవ్ చేసుకుని ఉంటే కనుక వెంటనే డిలీట్ చేయాలని తన కస్టమర్లను ఎస్.బీ.ఐ హెచ్చరించింది.

 

దేశంలో చాలా ఆన్ లైన్ మోసాలు జరుగుతున్నాయి. నిత్యం ఇలాంటివి వందల కేసులు నమోదు అవుతున్నాయి.. చాలా మంది మోసపోతున్నారు… ఇలాంటి ఇబ్బంది ఉండకూడదు అని బ్యాంకు ఖాతాదారులని హెచ్చరిస్తోంది..

మొబైల్ నుంచి వేర్వేరు యాప్ల ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

 

ఎస్బీఐ ఖాతాదారులు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని స్మార్ట్ఫోన్లలో ఉంచొద్దని సూచించింది. ముఖ్యంగా పిన్, డెబిట్, క్రెడిట్ కార్డుల సమాచారం, పాస్వర్డ్లు, సీవీవీ నంబర్ ఇవి ఏమీ ఉంచద్దు. అయితే చాలా మంది ఈ నెంబర్లు డీటెయిల్స్ సేవ్ చేసుకుని డేటా ఉంచుకుంటారు, అవి మొబైల్ లో ఉండటం వల్ల మోసగాల్లు మన డేటా చోరి చేసి నగదు కాజేస్తున్నారు, తెలియని లింకులు కూడా ఓపెన్ చేయవద్దు