ఈ కరోనా మహమ్మారి వల్ల మొత్తం అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి, ఓ పక్క కాలేజీలు స్కూల్లు కూడా నడవని పరిస్తితి.. అందరూ ఇంటి పట్టున ఉంటున్నారు.. ఉపాధి లేదు కూలీ లేదు ఉద్యోగం లేదు, పనిలేదు అందరూ ఇంటికే పరిమితం అయ్యారు, ఇక మరో నెల అయితే పిల్లలకు స్కూల్లు తీసే సమయం, ఇక వేసవి సెలవులు అయ్యాక స్కూళ్లకు అందరూ పరుగులు పెడతారు.
కొత్త అడ్మిషన్లు వస్తాయి. ఇక తాజాగా ఈ కరోనా ఎఫెక్ట్ తో చాలా మంది తల్లిదండ్రులకి పిల్లల ఫీజుల విషయంలో భయం ఉంది, అయితే తాజాగా ఏపీ సర్కార్ స్కూళ్లలో ఫీజులు పెంచవద్దని..వాయిదా పద్ధతిలో ఫీజులు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు 2020, ఏప్రిల్ 23వ తేదీ గురువారం రాష్ట్ర ప్రాథమిక విద్య కమిషన్ ఛైర్మన్ జస్టిస్ కాంతారావు పలు ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాదు ఈ సమయంలో పిల్లల పేరెంట్స్ ని ఫీజులు కట్టాలి అని అడగద్దు అని వత్తిడి తీసుకురావద్దు అని తెలిపారు, గత ఏడాది ఏ ఫీజుల స్ట్రక్చర్ ఉందో అదే వసూలు చేయాలి అని తెలిపారు, అంతేకాదు మొదటి మూడు నెలల ఫీజు మాత్రమే వసూలు చేయాలి అని తెలిపారు, అది కూడా రెండు వాయిదాల్లో తీసుకోవాలి అని తెలిపారు, స్కూల్స్ కాలేజీలు ఈ నియమం అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపింది ప్రభుత్వం.