తెలంగాణాలో నేడు పాఠశాలలు బంద్ కానున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) నిరసనగా నేడు పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చింది. ఈరోజు జరగనున్న బంద్ ను విజయవంతం చేయాలని విద్యార్థులకు విద్యార్థి సంఘ నేతలు పిలుపు నిచ్చారు. ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభమై దాదాపు నెల గడుస్తున్నా అనేక సమస్యలు పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.