ఏపీలో నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. మొత్తానికి స్కూల్లు కాలేజీలు ఓపెన్ చేస్తున్నారు, అన్నీ జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలు తెరవనున్నారు, అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ను వివరించారు. మరి ఎవరికి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది చూద్దాం.
నవంబర్ 2 నుంచి 9,10,ఇంటర్ మీడియట్ వారికి స్కూళ్ల కాలేజీలు ఓపెన్ అవుతాయి, కేవలం ఆఫ్ డే మాత్రమే నడుపుతారు, అలాగే రోజు విడిచి రోజు తరగతులు ఉంటాయి, అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా నవంబర్ 2 నుంచి స్టార్ట్ అవుతాయి.
నవంబర్ 23 నుంచి 6,7,8 క్లాసులకు స్టార్ట్ చేస్తారు, రోజు విడిచి రోజు ఉంటుంది వీరికి కూడా.
డిసెంబర్ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, హాఫ్ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు, ప్రభుత్వ
ప్రైవేట్ పాఠశాలు కాలేజీలకు ఇవే రూల్స్ వర్తిస్తాయి.