మనకు ప్రపంచంలో కనిపించేవి జాడలోకి వచ్చేవి కొన్ని జంతువులే.. అయితే చాలా తెలియనివి ఉన్నాయి.. ఇంకా మనకు తెలియని జంతువులు అనేక అడవుల్లో ఉన్నాయి, ఇక అమెజాన్ అడవుల్లో ఇంకా అంతు చిక్కని అనేక జంతువులు ఉన్నాయి, అయితే తాజాగా ఓ విచిత్ర పాముని కనుగోన్నారు పరిశోధకులు.
పరిశోధకులు వియత్నాంలో వింతైన పామును కనుగొన్నారు. వియత్నాం అడవులు, కొండప్రాంతాల్లో బయోడైవర్సీటీపై పరిశోధనలు చేస్తున్న వారు హా జియాంగ్ ప్రావిన్స్లో రంగురంగుల పామును చూశారు, ముందు దీనిని చూసి ఆశ్చర్యపోయారు ..ఇప్పటి వరకూ ఇలాంటి దానిని వీరు చూడలేదు.
చర్మంపై ఉన్న పొలుసులు నీలం నుంచి ఆకుపచ్చ రంగులు మారటం గమనించారు. ఈ పాముకి అచలినస్ జుగోరమ్ అని పేరు పెట్టారు, ఇది ప్రపంచంలో మొదటి సారి కనిపింంచింది.. ఇప్పటి వరకూ ఎక్కడా ఇలాంటిది గుర్తించలేదు అని తెలిపారు, దానిని చూసిన వెంటనే వారు దానిని అసలు ఏ జంతువో తెలుసుకోలేకపోయారు.