2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత చాలామందినేతలు సైకిల్ దిగిపోయిన సంగతి తెలిసిందే… ఏపీలో పార్టీ పుంజుకోవాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుందని భావించి ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు… ఇక ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు వైసీపీ తీర్ధం తీసుకోకపోయినా కూడా ఆ పార్టీకి మద్దుతు ఇచ్చారు…
ఇలా మద్దుతు ఇద్దతుచ్చిన వారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకరు… వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిరోజులకే వంశీ వైసీపీకి మద్దతుగా నిలిచారు… దీంతో అక్కడ టీడీపీ పోస్ట్ ఖాళీ అయింది… ఇంతవరకు టీడీపీ అధిష్టానం ఇక్కడ ఇంచార్జ్ ను నియమించలేదు తొలుత ఇక్కడ ఇంచార్జ్ బాధ్యతలను చేపట్టేందుకు గద్దే అనురాధ తీసుకుంటారని వార్తలు వచ్చాయి…
ఈక్రమంలోనే కృష్ణా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఇక్కడకు వస్తారని ప్రచారం జరిగింది… కానీ ఇప్పటివరకు ఇక్కడ ఇంచార్జ్ ను పెట్టలేదు ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ గన్నవరం బాధ్యతలను తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి… త్వరలో ఆమె టీడీపీ తీర్ధం తీసుకుని గన్నవరం బాధ్యతలు తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి…