వివాహం అయి దాదాపు ఐదు సంవత్సరాలు అయింది.. భర్త బాగానే చూసుకుంటున్నా హేమకి భర్తపై ప్రేమ పుట్టడం లేదు. పిల్లలు అప్పుడే వద్దు అని చెప్పింది. దీంతో భర్త కూడా ఆమె మాటని గౌరవించాడు కొంచెం ఆగుదామని భావించారు.. సంసారం చేస్తున్నా ఆమె నుంచి పెద్దగా ఏమీ రెస్పాన్స్ లేదు.. భర్త కూడా ఆమెపై ఎలాంటి అనుమానం పెంచుకోలేదు. అయితే తాజాగా ఓ రోజు ఆమె ఓ లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయింది.
నా తల్లి దండ్రులు బీదరికంలో ఉన్నారు అందుకే నీకు నాకు 10 ఏళ్లు గ్యాప్ ఉన్నా వివాహం చేశారు.. నేను హర్షద్ అనే వ్యక్తిని ప్రేమించాను. అతను కూడా నన్ను ప్రేమించాడు. కాని నేను నీతో ఉండలేకపోతున్నాను, అందుకే పిల్లలు వద్దు అనుకున్నాను, నేను ఇప్పుడు హర్షద్ దగ్గరకు వెళ్లిపోతున్నా, అతను ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అయ్యాడు, ఇప్పటి వరకూ చదువు అయ్యాక ఉద్యోగం లేక ఇబ్బంది పడ్డాడు.
అందుకే అతని దగ్గరకు వెళ్లలేదు.. ఇప్పుడు తను నన్ను పోషించగలడు, నా కోసం వెతకవద్దు, నువ్వు మరొకరిని వివాహం చేసుకో అని భర్తకి లేఖ రాసి ఆమె వెళ్లిపోయింది, అయితే భార్యపై ఏ కంప్లైంట్ ఇవ్వకుండా ఆమె ప్రేమని అర్ధం చేసుకుని అతను
సెకండ్ మారేజ్ చేసుకున్నాడు, అతని బాధని తన జీవితంలో జరిగిన ఘటనని ఓ పత్రికకి వ్యాసం రూపంలో ఇచ్చాడు.