ఈ కుక్క అరవలేదు కాని దొంగను పట్టించింది ఎలాగో చూడండి 

-

కుక్కలు విశ్వాసానికి మారు పేరు అనేది తెలిసిందే, అయితే ఇక్కడ జర్మనీలో ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చాడు ఓ దొంగ, అక్కడ కుక్క ఉండటం అతను గమనించలేదు, అయితే ఆ కుక్క మాత్రం అతన్ని చూసింది అది వెంటనే అరిచి ఉంటే వెంటనే అతను దానిని చూసేవాడు పారిపోయేవాడు, కాని అది  చాలా తెలివిగా తన యజమాని దగ్గరకు వెళ్లింది.. అక్కడ అది అరుపులు అరవకుండా అతనిని పైకి తీసుకువెళ్లింది.. ఈ లోపు అక్కడ నగదు లాకర్ ఓపెన్ చేసిన దొంగని చూసి ఓనర్ షాక్ అయ్యాడు.
ఇంట్లో అరుపులు అరవడంతో అతని ఇద్దరు కొడుకులు పైకి వచ్చారు వెంటనే ఆ దొంగ చేతులు కట్టేశారు, అయితే ఆ దొంగని
 ఇంత తెలివిగా ఆ కుక్క పట్టించింది.. అయితే ఇక్కడ ఓ విషయం ఏమిటి అంటే అందరూ అది ఎందుకు అరవలేదు అని అనుకున్నారు… కాని ఆ కుక్క నోటిలో పుండు వల్ల దాని గొంతు మూగపోయింది.
ఇక అది ఆనాటి నుంచి మాటలు లేక అలా ఉండిపోయింది… అయినా సరే అది తన యజమాని ఇంటికి దొంగ వస్తే పట్టించింది,
ఈ విషయాన్ని మైఖల్ తన ఫేస్ బుక్ ఖాతాలో రాసి పంచుకున్నడు, ఆ శునకాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...