కోతులని తక్కువ అంచనా వేయకూడదు, ఇవి కాని పగపట్టాయి అంటే మాములుగా ఉండదు.. ఎవరిని అయినా సరే పగబడితే ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టడి చేస్తాయి.. అంతేకాదు వాటి గుంపు అంతా అటాక్ చేస్తుంది, ఇటీవల సూరత్ లోని ఓ విలేజ్ లో ఓ వ్యక్తి తన తోటని ఈ కోతులు ధ్వంసం చేస్తున్నాయి అని, కోతులు పట్టేవారికి చెప్పాడు.. వారు వచ్చి పెద్ద బోను తెచ్చి ఆ తోటలో పెట్టారు.
అరటి పండ్లు పెట్టడంతో అవి బోనులో కూర్చున్నాయి.. అవి వెంటనే తింటూ ఉన్న సమయంలో బోన్ డోర్ క్లోజ్ అయింది.. పాపం అవి దిగాలుగా లోపల ఉన్నాయి ..దాదాపు 40 వరకూ చిక్కుకున్నాయి.. వాటిని దాదాపు 35 కిలోమీటర్ల అవతల అడవిలో వదిలారు.. కాని అవి ఆ తోటని గుర్తు ఉంచుకున్నాయి.. మళ్లీ వారం రోజులకే ఆ తోటమీదకి వచ్చాయి.
అంతేకాదు ఆ ఓనర్ వచ్చిన వెంటనే అతనిపై దాడి చేసి అతని సెల్ ఫోన్ తీసుకువెళ్లిపోయాయి… చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి.. దీంతో ఏం చేయాలో తోచడం లేదు అంటున్నాడు, అతని బాధ చూసి అందరూ అయ్యో అంటున్నారు.