సీమ వైసీపీలో ముదురుతున్న కోల్డ్ వార్…

సీమ వైసీపీలో ముదురుతున్న కోల్డ్ వార్...

0
101

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ స్టార్ట్ అయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు… ముఖ్యంగా రాయలసీమలో ఈ కోల్డ్ వార్ మరీ ఎక్కువగా ఉందని అంటున్నారు… పార్టీ ఆవిర్భావం నాటి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబాన్ని నమ్ముకున్న నేతలకు అన్యాయం జరుగుతుందని కొందరు వాపోతున్నారు…

స్థానికంగా కొందరు ఇటీవలే వైసీపీ కండువా కప్పుకున్న నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపోతున్నారు… ఇంకొన్ని చోట్ల అయితే పరస్పర దాడులు కూడా చేసుకుంటున్నారు… ఇటీవలే కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అలాగే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులు దాడులు చేసుకున్నారు…

ఈ దాడిలో రామసుబ్బారెడ్డి అనుచరుడు ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ కలకలం రేపుతోంది….ఇక నైనా పార్టీ అదిష్టానం స్పందించి కోల్డ్ వార్ కు చెక్ పెడితే బాగుంటుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు… లేదంటే రానున్న రోజుల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు… మరి చూడాలు అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో…