ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నిరసన సెగ (వీడియో)

Sega protests against MLA Chirumarthi Lingaya (video)

0
112

తెలంగాణ: నకిరేకల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నిరసన సెగ తగిలింది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో నేడు ఎమ్మెల్యే లింగయ్య పర్యటించారు. ఈ క్రమంలో గ్రామంలో అభివృద్ది పనులు చేపట్టాలని, అన్ని వార్డుల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు వేయాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

గతంలో శంకుస్థాపన చేసి ఆపేసిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని సీపీఎం నేతలు ప్లకార్డులతో నిరసన తెలుపుతుండగా టీఆర్ఎస్ కు చెందిన ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించి ప్లకార్డులను చింపాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత పోలీసులు సీపీఎం నేతలను అడ్డుకున్నారు.

సీపీఎం నేతలు మాత్రం ఎమ్మెల్యే అక్కడి నుంచి కదులకుండా ప్రతిఘటించారు. ఆ తర్వాత పలువురు మహిళలు కూడా ఎమ్మెల్యేను అడ్డుకొని తమ వార్డు సమస్యలను చెప్పారు. దీంతో గ్రామంలో ఎమ్మెల్యే లింగయ్యకు అడుగు అడుగునా నిరసన వ్యక్తమైంది. టీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు సరికాదని, రౌడీల్లా ప్లకార్డులు చించి తమను అడ్డుకోవడం ఏంటని సీపీఎం నేతలు ప్రశ్నించారు. రాజ్యాంగంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదని వారు ప్రశ్నించారు.

https://www.facebook.com/alltimereport/videos/807780213544259