సెలూన్స్ కు కొత్త రూల్స్ ఇవి పాటించాల్సిందే

సెలూన్స్ కు కొత్త రూల్స్ ఇవి పాటించాల్సిందే

0
88

ఇప్పుడు కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది ఈ సమయంలో అతి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, అయితే మొన్నటి వరకూ సెలూన్స్ కు పర్మిషన్ ఇవ్వలేదు, తాజాగా వాటికి పర్మిషన్ ఇచ్చారు, అయితే తమిళనాడు సర్కార్ సరికొత్త రూల్స్ తీసుకువచ్చింది.

సీట్లలో 50 శాతం మాత్రమే నింపుకోవచ్చు. సీట్ల మధ్య ఖాళీ ఉండాలి, ఎవరి టవల్ వారే తెచ్చుకోవాలి, భౌతిక దూరం పాటించాలి, టవల్ మాస్క్ కర్చీఫ్ ఏదో ఒకటి తప్పకుండా ధరించాలి, ఒక కస్టమర్కి వాడిన బ్లేడ్, మరో కస్టమర్కి వాడకూడదు. టవల్స్ ఒకరివి ఒకరికి వాడకూడదు. కత్తెరలు షేవింగ్ ఐటెమ్స్ అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి.

ఏసీ ఆన్ చెయ్యకూడదు. కిటీకీలన్నీ తెరచి ఉంచాలి. లోపలికి గాలి వచ్చేలా చెయ్యాలి.చైర్లు, టేబుళ్లు, డోర్లు, అద్దాలు అన్నీ… లైజోల్ లేదా హైపోక్లోరైట్ కలిపిన మిశ్రమంతో రోజుకు ఐదుసార్లు శానిటైజ్ చెయ్యాలి. సెలూన్స్ లో ముచ్చట్లు పెట్టకూడదు.. పనిచేసేవారు తమ ముక్కు, నోరు, కళ్లను ముట్టుకోకూడదు.ఇవన్నీ తమిళనాడులో పాటిస్తున్నారు, దేశం అంతా ఇవే రూల్స్ పాటించాలి అని కోరుతున్నారు జనం.