బిజెపిని ఇరికించేలా గట్టి పాయింట్ లేవనెత్తిన కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి

0
111

టిపిసిసి కూర్పుపై ఒకింత అసంతృప్తితో ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి. ఆయన తాజాగా ఒక పత్రికా ప్రకటన జారీ చేశారు. దానిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపిని కార్నర్ చేసే అంశాన్ని ప్రస్తావించారు. ఆ లేఖ ఏంటి? ఆయన ఏ పాయింట్ ఎత్తుకున్నారు… పూర్తి వివరాల కోసం లేఖను యదాతదంగా దిగువన పొందుపరిచాము. చదవండి…

కాశ్మీర్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడానికి డెలిమిటేషన్ చేపట్టాలి

మర్రి శశిధర్ రెడ్డి
పత్రికా ప్రకటన – 01.07.2021

2013 లో కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై చర్చలు జరుపుతున్నప్పుడు అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడానికి నేను చొరవ తీసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ లో విస్తృతంగా చర్చించి అన్ని పార్టీల సహకారం తో గ్రూప్ అఫ్ మినిస్టర్స్ కు నివేదించి ఒప్పించాను. పర్యవసానంగా, AP పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుండి 153 కు మరియు ఆంధ్రప్రదేశ్ లో 175 నుండి 225 కి పెంచడానికి చట్టం (సెక్షన్ 26) లో పొందు పర్చడం జరిగింది. అయితే రాజంగం లోని ఆర్టికల్ 170 కి లోబడి ఉంటుందని చెప్పడం జరిగింది.

అదలావుండగా జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 లో కూడా అసెంబ్లీ సీట్ల సంఖ్యను 83 నుండి 90 కి పెంచడానికి వీలు కల్పించారు.

ఆగష్టు 5, 2019 కి ముందు, ఆ రాష్ట్రంలోని లోక్ సభ స్థానాల డీలిమిటేషన్ భారత రాజ్యాంగం లోబడి జరిగినా, అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్ను మాత్రం జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం మరియు జమ్మూ కాశ్మీర్ ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1957 లోబడి నిర్వహించ బడ్డాయి. ఇప్పుడు మొత్తం డెలిమిటేషన్ ప్రక్రియ మన రాజ్యాంగం ప్రకారమే జారుతుంది.

ఆర్టికల్ 170 విషయానికొస్తే, 2002 లో సవరించినట్లుగా సీట్ల సంఖ్యను మరియు వాటి పరిధి – ప్రాదేశిక 2026 తరువాత మొదటి జనాభా గణన తరువాత మార్చవచ్చని ఉంది..
సుమారు 2 సంవత్సరాల తరువాత, ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ కాశ్మీర్ పై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఇతర విషయాలతోపాటు, అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ గురించి చర్చించారు.

సీట్ల సంఖ్యను పెంచే ప్రక్రియ ఆర్టికల్ 170 కు లోబడి ఉంటుంది. అందుకే రాజ్యాంగ సవరణ అనివార్యం! ప్రధాని చొరవ తీసుకోవడం తో ఇది త్వరలో ప్రారంభమవుతుంది
దీనితో బాటు ఆ.ప్ర. పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచినట్టు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోను కాశ్మీర్ తోబాటు ఏకకాలంలో ప్రారంభం కావాలి.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల మునిగిపోయే పూర్వపు ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను బదిలీ చేయాలని ఎన్డీయే ప్రభుత్వంలో భాగమైన టిడిపి పట్టుబట్టడంతో విభజన తరువాత ఈ చట్టం సవరించబడింది.

ఈ 7 మండలాలు 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో భాగంగా ఉన్నాయి, అవి భద్రాచలం, అశ్వవరోపేట మరియు పినపాక మరియు వాటి పరిధి మరియు సరిహద్దులు మార్చబడ్డాయి. ఇది ఆర్టికల్ 170 లోని నిబంధనలకు విరుద్ధం. ఈ 7 మండలాల ఓటర్లు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఓటు వేశారు, కాని వారి బదిలీ తరువాత ఎపి నివాసితులు అయ్యారు.

రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిఎం కెసిఆర్ 2018 ఆగస్టులో యోచించినప్పుడు తెలంగాణలోని 3 నియోజకవర్గాల ఓటర్లుగా తొలగించి, ఎపిలోని రెండు నియోజకవర్గాల ఓటర్లుగా మార్చడానికి రాజ్యాంగబద్ధంగా మరియు చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే డీలిమిటేషన్ చేయలేదని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చాను. రాజ్యాంగ సవరణ అవసరమని నేను వాదించాను, ఎందుకంటే కేవలం ఒక గ్రామాన్ని ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి బదిలీ చేయడం కూడా సరిహద్దులు మార్చబడి అది డీలిమిటేషన్ తప్ప మరొకటి కాదు.

7 మండలాలకు సంభందించి డెలిమిటేషన్ పై నేను 08.09.2018 న పిల్ కూడా దాఖలు చేశాను. అయితే దీన్ని అధిగమించడానికి 22.09.2018 న ఈసీ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది, ఇది రాజ్యాంగ విరుద్ధం. సిఎం కెసిఆర్ ఎలక్షన్ కమిషనర్లు. తో స్వయంగా మాట్లాడడం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరగడానికి ఈసీ రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ , కెసిఆర్ తో పూరీతిగా సహకరించారు.

వారు చేసిన తప్పును సరిదిద్దుకోవాలని డిమాండ్ చేస్తూ నేను 18.03.2021 న సిఇసికి లేఖ రాశాను. పార్లమెంటరీ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల ఉత్తర్వు, 2008 ను సముచితంగా సవరించడానికి 22.09.2018 నాటి చట్టవిరుద్ధ నోటిఫికేషన్ స్థానంలో, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కొరకు విడిగా రాజ్యాంగబద్ధంగా మరియు చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే నోటిఫికేషన్లను జారీ చేయాలని డిమాండ్ చేశాను.

కాశ్మీర్‌పై జరిగిన అన్ని పార్టీల సమావేశానికి కేవలం 3 రోజుల ముందు, 21.06.2021 నాకుస మాధానమిచ్చారు. అది వారి తప్పును కప్పిపుచ్చడానికి మరియు సమర్థించడానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇందులో 16.11.2018 నాటి హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉదహరించింది, అయితే కేంద్ర హోమ్ సఖ వారు ఇచ్చిన సలహాను పేర్కొనకుండా లోపభూయిష్టంగా ఉంది. సీట్లు పెంచడానికి వెంటనే డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలి. అయితే దీనికి సంభంధం లేకుండా 22.09.2018 న EC ఇచ్చిన నోటిఫికేషన్ ను న్యాయస్థానంలో సవాలు చేస్తాను.

గతంలో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో సీట్లను పెంచేవిషయం పై, 2015 జనవరి లోనే ఇరు రాష్ట్రాలకు చెందిన అన్ని రాజకీయ పార్టీ నాయకులతో డా. మర్రి చెన్నా రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు నేను ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు, అన్ని రాజకీయ పార్టీ నాయకులకు లేఖ వ్రాస్తూ , అందరు కలిసి కాశ్మీర్ తో పటు డెలిమిటేషన్ ప్రక్రియ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మొదలు పెట్టించడానికి గట్టి ప్రయత్నం చేయాలని వారిని కొరతను.