సీనియర్ జర్నలిస్టు శ్రీరంగనాధ్ మృతి

Senior journalist Sriranganath dies

0
89

సీనియర్ జర్నలిస్టు, నీటిపారుదల రంగ నిపుణుడు నిమ్మకాయల శ్రీరంగనాధ్ గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్ళు. తూర్పు గోదావరి జిల్లా ఎన్.కొత్తపల్లి మండలంలో జన్మించారు. మునిపల్లెలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి కాకినాడలో ఉన్నత విద్యను చదివారు. వామపక్ష రాజకీయాల ప్రభావంతో జర్నలిజంలోకి వచ్చి ఉదయం, వార్త, ఆంధ్రప్రభలో వివిధ హోదాలలో పని చేశారు.

ఏపీ టైమ్స్ ఇంగ్లీషు దినపత్రికకు హైదరాబాదు బ్యూరో చీఫ్ గా వ్యవహరించారు. ఆయనకు భార్య లక్ష్మీకాంతం, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన కుమారుడైన నిమ్మకాయల వంశీ ప్రస్తుతం డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్ గా ఉన్నారు. రంగనాథ్ అంత్యక్రియలు గురువారం హైదరాబాదు జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.‌ ఆయన మరణం పట్ల పలువురు అధికార, అనధికార ప్రముఖులు, జర్నలిస్టు సంఘాలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు..