టీఆర్ఎస్ ను వీడిన సీనియర్ నేత..కారణం ఏంటంటే?

Senior leader who left TRS..what is the reason?

0
78

టీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం జిల్లా సీనియర్ నేత గట్టు రామచందర్ రావు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేసీఆర్‌‌కు పంపారు. మీ అభిమానం పొందడంలో, గుర్తింపు తెచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యానని లేఖలో గట్టు చెప్పారు. మీరు ఆశించిన స్థాయిలో తాను పార్టీలో రాణించలేకపోయానన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని తాను భావించానన్నారు.

అందుకే టీఆర్‌ఎస్‌ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్నారు. ఇంతకాలం పార్టీలో తనకు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు అవకాశం కల్పిస్తారని గట్టు రామచందర్ రావు ఆశించారు. అయితే గట్టుకు కాకుండా తాతా మధుకు ఆ స్థానాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారు.

దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన గట్టు రాజీనామా చేశారని తెలుస్తోంది. గతంలో వామపక్ష పార్టీలో గట్టు రామచందర్ రావు పని చేశారు. తరువాత వైస్సార్సీపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరారు.