హుజురాబాద్ ఎన్నికల సంఘటనలపై గాంధీ భవన్ లో మాజీ ఎంపీ రాజయ్య సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ..హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారుతుంది. అంగట్లో కొన్నట్లు ఓటర్లని కొంటున్నారు. మద్యం ఏరులైపారుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలంధరపై ఉంది. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. ఇది మంచిది కాదు. హుజురాబాద్ లో జరుగుతున్న సంఘటనలని ఎన్నికల కమిషన్ పటించుకోవడం లేదు. హుజురాబాద్ ఉపఎన్నికని రద్దు చేసి, ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యని కాపాడాలి. ఏమాత్రం నైతిక విలువలు ఉన్న వెంటనే రాజీనామా చేయాలి. ఈటెల రాజేంద్ర ఆస్తుల రక్షణ కోసం బీజేపీలోకి వెళ్లాడా లేక ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వెళ్లాడా అన్నది అందరికి తెలుసు.
హుజురాబాద్ లో జరగుతున్న సంఘటనలకు సీఎం కెసిఆర్, మోడీ బాద్యత వహించాల్సిందే. ఓటింగ్ ని ఆన్లైన్ లో వేసే విధంగా చేయాలి. రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలి. అత్యంత విలువైన ఓటు అమ్మబడుతూ..ప్రజాస్వామ్యం కూని అవుతుందని విమర్శించారు.
అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి కామెంట్స్ …
సీఎం కెసిఆర్ కి చిత్త శుద్ధి లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్ళాల్లోకి వచ్చిన వడ్లని వెంటనే కొనుకోలు చెయాలి. కలెక్టర్ వెంకటరామిరెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు. కలెక్టర్ వెంకటరామిరెడ్డి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కెసిఆర్ కి మంత్రి వర్గం మీద పట్టు లేదా? మంత్రులు వరి కొనుగోళ్లపై ఒక్కొక్కరు ఒక్కోవిధంగా మాట్లాడుతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు కలిసి రైతులతో ఆటలాడుతున్నారు.